హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానానికి (Indigo Flight) హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్టులో విమానం లాండ్ అవుతుండగా ఒక పక్షి దానికి తగిలింది. దీంతో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా కిందికి దించారు.
ఆ సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్ష తగలడంతో విమానానికి స్వల్ప నష్టం జరిగిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. పైలట్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పిందని వెల్లడించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.