Manne krishank | సీఎం రేవంత్ రెడ్డితోపాటు కూతురు బినామీ వ్యాపారాలపై బీఆర్ ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆధారాలతో సహా ప్రెస్మీట్లో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆకు రౌడీ చెంచా మన్నె క్రిశాంక్‌ను బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వీడియో బయటకు వచ్చింది.
ముఖ్యమంత్రి గురించి వాళ్ల అమ్మాయి గురించి కంపెనీలున్నాయని.. నేనే అది చేస్తా.. ఇది చేస్తా. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌కు నేను కంప్లెయింట్ ఇచ్చిన. అక్కడి నాకు సమాచారముందంటున్నవ్.. అరే క్రిశాంక్ గుర్తు పెట్టుకో.. మా మైనంపల్లి హన్మంతరావు అన్న శిష్యులం .. మేము, రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్. నీకు ఇంకో టైం ఇస్తున్నా. గంట సేపటిలో నువ్వు రేవంత్ మీద పెట్టిన వీడియోలు డిలీట్ చేయకపోతే మేం నీ మీద భౌతిక దాడులు చేస్తామన్నాడు.
నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం గమ్మున ఉండేది లేదు. నీ ఇంటి నీ బట్టలూడ దీసి కుక్కను కొట్టినట్టు కొడ్తం.. నీ గాడ్‌ఫాదర్‌ను ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నట్టున్నవ్. నీ వీపు పగులగొడ్తం జాగ్రత్త. రేవంత్ భార్య గురించి కానీ, కూతురు గురించి కానీ మాట్లాడితే నీ ఇంటికొచ్చి నీ మీద భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించాడు.. వీడియోలు డిలీట్ చేయకపోతే నిన్ను కంటోన్మెంట్ ఏరియాలో బతుకనీయమన్నాడు.
గంటలో రేవంత్ రెడ్డి మరియు ఆయన బిడ్డ బినామీ వ్యాపారాల వీడియోలు డిలీట్ చేయకుంటే మన్నే క్రిశాంక్ నీ ఇంటికొచ్చి భౌతిక దాడులు చేస్తాం
మైనంపల్లి ఆకు రౌడీ చెంచాల వార్నింగ్ https://t.co/sO8CDU8YC5
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2026