వెంగళరావునగర్, మే 4 : జానకమ్మ తోటలోకి వెళ్లిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దోపిడీ దొంగ లాక్కుని పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం .. రహ్మత్‌నగర్‌కు చెందిన మంగలి శంకరమ్మ (55) యూసుఫ్ గూడలోని ఇండ్లల్లో పనులు చేస్తుంటుంది. ప్రతిరోజూ లాగే శనివారం యూసుఫ్ గూడలో పనులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరింది.
దారిలో యూసుఫ్ గూడలోని కల్లు కాంపౌండ్ లో కల్లు తాగింది. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు జానకమ్మ తోటలోని ఖాళీ స్థలంలోకి వెళ్లింది. అక్కడ ఓ దొంగ బండ రాయితో కొడతానంటూ భయపెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.