అడ్డగుట్ట, సెప్టెంబర్ 28 : లష్కర్ జిల్లా సాధన సమితి బీసీ సెల్ అధ్యక్షులుగా మెట్టుగూడ ప్రాంతానికి చెందిన ర్యాల మహేందర్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్‌కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామకపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ..లష్కర్ జిల్లా ఏర్పాటులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.
ప్రజల్లో జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతపై రానున్నరోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు బాలరాజ్ యాదవ్, సునీల్ ముదిరాజ్, గీత దయాకర్, శైలందర్, శ్రీకాంత్, కృష్ణ, వినోద్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.