తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 2: మహా భారతా న్ని అర్థం చేసుకుంటే ఒక విజ్ఞాన బండాగారంగా సమా జానికి దారి చూపుతుందని తెలంగాణ సారస్వత పరిష త్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూ రి శివారెడ్డి అన్నారు. తెలంగా ణ సారస్వత పరిషత్తులో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామ చందర్రావు తన తల్లి నారపరాజు రాఘవ సీత పేరిట ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారాన్ని ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు డాక్టర్ సుమతీ నరేం ద్రకు మంగళవారం పరిషత్తులో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. పురస్కారం కిం ద రూ.5వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సమతీ నరేంద్రను ఘనంగా సత్కరించారు. పరిష త్తు అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ తిక్కన భారత రచనలో విశాలమైన థృక్పథాన్ని ఆవిష్కరించారన్నారు. రామచందర్ రావు మాట్లాడుతూ తమ తల్లి రాఘవ సీత ఎక్కువగా చదువుకోకపోయినా సాహిత్య గ్రంథాలను, పత్రికలను ఇష్టంగా చదివేవారన్నారు. ‘తిక్కన కవితా వైభవం’ అనే అంశంపై పురస్కార గ్రహీత సుమతీ నరేంద్ర ప్రసంగం చేశారు. పరిష త్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు తదితర సాహితీ వేత్తలు పాల్గొన్నారు.