Telangana Assembly Elections | హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ లీడ్లో ఉన్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్కు 1734 లీడ్ వచ్చింది. ఎనిమిది రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి 3283, కాంగ్రెస్కు 2546 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి 21841, కాంగ్రెస్కు 20107 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీలో ఉన్నారు.