BRS Mlcs | శాసనమండలి( Legislative Council)నుంచి బీఆర్ఎస్ సభ్యులు(BRS Mlcs ) వాకౌట్ చేశారు. సభ జరుగుతున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలపై వెంటనే చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. మండలి చైర్మన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసుదనాచారి మండలిలో మార్షల్స్ ప్రవర్తను తీవ్రంగా తప్పు పట్టారు. మార్షల్స్ ద్వారా సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. శాసన మండలిలో బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్స్, మైక్ ఇవ్వక పోవడం వంటి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలో చట్ట సభల్లో ప్రజల తరఫున తమ వాయిస్‌ను బలంగా వినిపించేందుకు బీర్ఎస్ ప్రజాప్రతినిధులు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు.
ఇందులో భాగంగా శాసనమండలిలో తమ నిరసనను కెమెరాలో చూపించడం లేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్న ఆలోచన చేశారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) మాట్లాడేటప్పుడు పక్కన కూర్చొని, జేబులో ఉన్న పేపర్‌ను చూపిస్తూ బామ్మర్దికి అమృత్ టెండర్లు.. తమ్ముడికి రావిర్యాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ అంటూ నిరసన తెలిపారు. గమనించిన మండలి సిబ్బంది వెంటనే కెమెరా తిప్పేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు సస్పెన్షన్ గురైన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సోదరుడు కొండా రెడ్డి అక్రమాలను ప్రజలకు చూయించేందుకు ఫోర్త్ సిటీకి బయలుదేరి వెళ్లారు.