Hyderabad Metro | సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ సంస్థకు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ గుర్తింపు దక్కింది. పనిచేసే చోట సంస్కృతికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ ప్రాధికార సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ప్రకటించింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు ఈ సర్టిఫికేషన్ గుర్తింపు అమల్లో ఉంటుందని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పనిచేసే చోట ఉద్యోగులకు సానుకూలమైన, సాధికారమైన పరిస్థితులను కల్పించడంలో ఎల్ అండ్ టీ మెట్రో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ సర్టిఫికేషన్ లభించిందన్నారు.