మరొకరితో ప్రియురాలి పెళ్లి.. ఫంక్షన్‌హాల్ వద్ద నిప్పంటించుకున్న ప్రియుడు
హైదరాబాద్ : ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ యువతికి మరొకరితో వివాహం నిశ్చయించారు.. పెళ్లి కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. ప్రియురాలికి వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్‌హౌజ్ మొగల్ ఫంక్షన్ హాల్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఆశ్వక్(19), స్థానికంగా ఉన్న ఫాతిమా(19)ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ విషయం ఇంట్లో తెలియడంతో ఫాతిమాకు మరొకరితో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో నిన్న ఫాతిమాకు లంగర్‌హౌస్‌లోని మొగల్ ఫంక్షన్ హాల్లో మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ విషయం ఆశ్వక్‌కు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లిన ఆ ప్రేమికుడు.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

