హైదరాబాద్ : నగరంలోని అంబర్పేట్లో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఇటుకలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో లారీలోకి ఇటుకలను తరలించారు.
ఈ మార్గంలో ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటం, లారీ బోల్తా పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోల్తా పడ్డ లారీని క్రేన్ సాయంతో రోడ్డు పక్కకు తరలించారు.