చిక్కడపల్లి, ఏప్రిల్ 6: నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి వివేక్‌నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ సంప్రోక్షణ పూర్వక పునశ్చరణ విగ్రహ శిఖర చక్రకలశ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ క్షేత్ర పీఠాధీశ్వరులు మధసూదనానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా యంత్ర, విగ్రహ, శిఖర కలశ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఆలయాలు ధర్మ పరిరక్షణ నిలయాలని అన్నారు. మహోత్సవం స్థాపిక పూజలు, జీవన్యాస ప్రాణప్రతిష్ఠ, మహాకుంభ బలిహరణం, బలిప్రదానం, పూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణ, దేవతామూర్తులకు అభిషేకాలు, అలంకరణ, మహానివేదన, పలు పూజలు నిర్వహించారు. పండితులకు సత్కారం, అన్న ప్రసాద వితరణ జరిగింది.
స్వామివారిని దర్శించుకున్న మంత్రి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ వాణీదేవి, స్థానిక కార్పొరేటర్ పావని ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరై, స్వామి వారిని దర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.2లక్షల నగదును ఆలయ ఈఓ దేవానాదంకు అందజేశారు. చైర్మన్ గుండెపూడి మురళీ ప్రసాద్, కార్యనిర్వహణాధికారి మాచర్ల దేవనాధం కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ముఠా నరేశ్, రాఖేశ్, జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్ రావు, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, దేవాలయం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు డాక్టర్ జీకే రమణ, మురిగి గణేశ్, పద్మ సూర్యప్రకాశ్, టి.రామకృష్ణ, అర్చకులు కె. కృష్ణమూర్తి, బుగ్గా లక్ష్మీపతి శర్మ, కందాళ వెంకట్రామి, పురుషోత్తమాచారి, ఎస్బీవీఎస్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.