సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ) : పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 25వ అదనపు చీఫ్ జడ్జి ప్రతిమ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో రెండవ అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర్‌రావు, సికింద్రాబాద్ మొదటి అదనపు జడ్జి ఎస్వీవీ శ్రీనాథ్‌రెడ్డి, అదనపు ప్రధాన న్యాయమూర్తులు ఏఏ జయరాజు, జీవన్‌కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, రోజా రమణి, సరిత, సునీతారవీందర్రెడ్డి, శ్రీదేవి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.