TSRTC Logistics | ఎల్బీనగర్, మార్చి 13: దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్ కౌంటర్‌ను గురువారం ప్రారంభించేందుకు సిద్దం చేశారు. ప్రస్తుతం అన్ని రకాల పార్సిల్స్‌ను చేర వేస్తున్న ఆర్టీసీ సంస్థ.. తన సేవలను మరింత విస్తరించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు లాజిస్టిక్ విభాగానికి కొత్త లోగోను, బ్రోచర్‌ను తయారు చేశారు.
గురువారం ఉదయం 10:15 గంటలకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో నూతన లాజిస్టిక్ కౌంటర్‌ను ప్రారంభించి, లాజిస్టిక్ లోగోను, బ్రోచర్‌ను ఆవిష్కరించనున్నారని దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్- 2 డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎండీ సజ్జనార్‌తో పాటుగా ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆధికారి డాక్టర్ రవీందర్, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.