కీసర, మార్చి 2: కీసరలోని పలు కాలనీల్లో మౌలిక వసతులు లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో మట్టి రోడ్లు ఉండడంతో వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తున్నది. కీసరలో శ్రీ రామలింగేశ్వరకాలనీ, నందినీనగర్ కాలనీ,సిద్దార్థనగర్ కాలనీ, శివాజీనగర్ కాలనీలతో పాటు చాలా కాలనీలు పది సంవత్సరాల క్రితం వెలిశాయి. ఒక్కో కాలనీల్లో సుమారు 1000కి పైగానే జనాభా ఉంది. ఈ కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోవడంతో కాలనీవాసులు పడుతున్న అవస్థలు వర్ణనాతితం.పలుకాలనీలవాసులు సర్పం చ్‌కు విన్న వించినా ఫలితం లేదు. సంబంధిత అధికారులు స్పందించి తమ కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టాలని పలు కాలనీలవాసులు కోరుతున్నారు.
సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నాం..
సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చాలా కాలనీల వాసులం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి రోజూ కాలనీల్లో మట్టి, దుమ్ము దూళి ఇంట్లోకే వస్తుంది. స్థానిక కాలనీలో చాలా వరకు రోజువారి కూలీచేసే కార్మికులు ఎక్కువ మంది నివసిస్తు న్నాం. సర్పంచ్,అధికారులు స్పందించి కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలి. -ముస్తాఫాఆలీ, నందినీనగర్ కాలనీ
సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
కీసరలోని నందినీనగర్ కాలనీల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. సమస్యలను సర్పంచ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. అయినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలి.
-జె. బాల్‌రాజ్, నందినీనగర్ కాలనీ