జూబ్లీహిల్స్,ఫిబ్రవరి6 : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ni-msme) ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ(Yusufguda)లోని నిమ్స్‌మే క్యాంపస్‌లో బుధవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు లోన్ మేళా(Loan Mela) నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంక్‌ల ప్రతినిధులు మేళాలో పాల్గొంటారని.. మరిన్ని వివరాలకు 040-23633244/218/261 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.