సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర ఉన్నందున శాంతిభద్రతలు పరిరక్షించడంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.