జూబ్లీహిల్స్,ఆగస్టు 25: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గురువారం యూసుఫ్‌గూడ డివిజన్లో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి దళితబంధు లబ్ధిదారుడు నర్సింగ్దాస్కు ఇంటివద్ద కారును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దళితులను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. లబ్ధిదారుడు మాట్లాడుతూ దళితబంధు పథకంతో జీవనోపాధిని కల్పించిన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే మాగంటి గోపిపీనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అద్యక్షుడు సంతోష్, కళ్యాణి, గీతాగౌడ్, వేణుగోపాల్, స్రవంతి, అరుణ, చిన్న యాదవ్, శ్రీను, రేణుక పాల్గొన్నారు.