సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. శుక్రవారం రాత్రి 9గంటల వరకు వినాయక్‌నగర్‌లో అత్యధికంగా 2.50 సెం.మీ, చర్లపల్లిలో 2.40, కాప్రా, ఏఎస్రావు నగర్లో 2.0, నేరెడ్మెట్, సఫిల్‌గూడ, ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 1.50, మౌలాలి, బోయిన్పల్లి తదితర ప్రాంతా ల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు పలు చోట్ల వానలు కురిసే అవకాశాలున్నట్లు చెప్పారు. మరో వైపు పగటి వేళ ఉక్కపోత తప్పడంలేదు.