జూబ్లీహిల్స్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం గ్రేటర్‌లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. షేక్‌పేట, గచ్చిబౌలి, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, గన్‌ఫౌండ్రి, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.
కాగా, ఉష్ణోగ్రత గరిష్ఠం 30.2, కనిష్ఠం 24.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 66 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.