సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పశ్చిమ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి 8.30 గంటల వరకు షేక్‌పేటలో అత్యధికంగా 2 సెం.మీలు, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో 1.1సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.1డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.5డిగ్రీలు, గాలిలో తేమ 72శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.