HYD Rains | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు రోజుల్లో కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
చార్మినార్, బండ్లగూడ, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలు మినహా నగరంలోని చాలా ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం నగరంలోని మియాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఇక పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
KTR | ‘హైడ్రా’ వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్