సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు కారిడార్-1లోని ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌కు ఎల్ఐసీ ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌గా పేరు మార్చారు. కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారానికి మెట్రోస్టేషన్లకు పేర్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎల్అండ్టీ మెట్రో అధికారులతో కలిసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అధికారులు ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌ను సందర్శించి పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బోర్డును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే బుధవారం హైదరాబాద్ మెట్రో రైలులో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డిలతో కలిసి కారిడార్-3 మార్గంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రయాణం చేశారు. అనంతరం ఉప్పల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు డిపోను ఆమె సందర్శించారు.