ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 22 : మాదిగల సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతపై బీజేపీ నిర్లక్ష్యపూరిత వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 15న హైదరాబాద్‌ను నలువైపుల నుంచి ముట్టడిస్తున్నట్లు చెప్పారు. బుధవారం పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామ్యూల్, డప్పు మల్లికార్జున్, బాలకృష్ణ, రాజశేఖర్, సీతారాం, రాజారాం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.