మలక్‌పేట, జూలై 10: మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో సోమవారం యూఎస్ఏ టీచర్ల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (ఐఆర్ఈఎక్స్) యూఎస్ఏ వారి టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా టీచర్ల బృందానికి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు వారు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. స్టెవ్ అంశంపై కొలరాడో నుంచి వచ్చిన జెస్సీకా నాఫ్ సింగర్, నార్త్ డోకాట నుంచి వచ్చిన ఆబ్రె మెక్నారీ ఆంగ్ల భాష బోధన, పరిజ్ఞానంపై బోధించనున్నారు. వీరితో పాటు ఐఆర్ఈఎక్స్ అధికారి లెన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా జెస్సీకా అమెరికా విద్య విధానంపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా విద్యార్థిని సౌజన్య జగదీశ్వర్ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించగా, నాగలక్ష్మీ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జి.శ్రీధర్, ఇన్చార్జి సుజాత కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.శ్రీధర్, ఇన్చార్జి సుజాత, పద్మప్రియలతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.