ఉప్పల్, మే 17: పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు శనివారం నాగోల్‌లోని మెట్రో ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎమ్ఎల్) న్యూ డెమోక్రసీ, ఎస్‌యూసీఐ, ఎంసీపీఐ సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో నేతలు మాట్లాడుతూ.. మెట్రో నష్టాలకి యాజమాన్యమే కారణమని, నష్టాలు పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని..నష్టాల భారం ప్రజలపై మోపుతామంటే ఎలా అని అన్నారు. చార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
ధర్నా అనంతరం ఎల్ అండ్ టి యాజమాన్యానికి వామపక్ష పార్టీల తరఫున వినతిపత్రం అందించారు. సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ కార్యదర్శి వెంకటేశ్, సీపీఎం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ నాయకులు స్టాలిన్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు హన్మేష్, సీపీఎం జిల్లాల కార్యదర్శి వర్గ సభ్యులు వినోద, శ్రీనివాస్ రావు, దశరథ్, జిల్లా కమిటీ సభ్యులు వెంకన్న, నరేష్, సంతోష్, నాయకులు పాల్గొన్నారు.