అమ్మంటే.. మమకారం.. అమ్మంటే అనురాగం.. అందుకేనేమో.. నవ మాసాలు మోసి కని పెంచిన కుమారుడికి ఆ తల్లి భారమైనా.. తనను కష్టాలపాలు చేసిన కన్నబిడ్డకు ఏ కష్టమూ రాకుండా.. పేరు చెప్పేందుకు నిరాకరించి..పేగుబంధంపై అనురాగాన్ని చూపిందా తల్లి. శ్రీకాకుళానికి చెందిన రత్నరాములమ్మ (70)ను ఆమె కుమారుడు గురువారం ఉదయం బల్కంపేటలోని షాపింగ్ కాంప్లెక్స్ పక్కనున్న రహదారిపై బ్యాగులో దుస్తులు సర్దేసి.. అమ్మచేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన ఆశవర్కర్ భాగ్య పలకరించారు.
ఆమె ఆకలి తీర్చి.. వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన ఊరు, పేరు చెప్పినా.. తనను వదిలేసి వెళ్లిపోయిన కొడుకు పేరు మాత్రం చెప్పలేదా తల్లి. కాగా, రత్నరాములమ్మను భాగ్య ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించగా, వారు ఈసీఐఎల్‌లోని లార్డ్డ్ మాత హోమ్‌కు తరలించి ఆశ్రయం కల్పించారు.
– వెంగళరావునగర్, ఏప్రిల్ 27