కందుకూరు, ఏప్రిల్ 6: బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బేగంపేట్ గ్రామానికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నాయకులు సర్పంచ్ గోవర్ధన్ ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి పక్షాలకు భయం పట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, పొట్టి ఆనంద్, దేవీలాల్, సమ్మయ్య, బొక్క దీక్షిత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.