చాదర్‌ఘాట్, డిసెంబర్ 14 : ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మలక్‌పేట నియోజకవర్గంనకు చెందిన నేతలు పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగామలక్పేట నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ మరో చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, మేయర్ గద్వాల విజయలక్ష్మీలను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
సైదాబాద్, డిసెంబర్ 14 : దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించటం ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా బుధవారం సైదాబాద్ ప్రధాన రహదారిపై మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మైల్కోల్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ.. యావత్ దేశప్రజలు తెలంగాణ వైపు దృష్టి సారించే విధంగా పథకాలు అమలు పరుస్తూ విశ్వసనీయతను చాటారని అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు సీఎం కేసీఆర్ ప్రయాణం వచ్చిందని, ఇంకా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయటం ఖాయమన్నారు. దేశ ప్రజలంతా బీఆర్ఎస్కి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కుర్మగూడ, సంతోష్‌నగర్ డివిజన్ల అధ్యక్షులు దర్శనం నర్సింగ్ రావు, చింతల శ్రీనివాస్ నాయీ, సయ్యద్ సాబేర్, లక్ష్మయ్య, హనుమంతరావు, ప్రేమ్‌కుమార్, మైల్కోల్ రవీందర్ యాదవ్, సురేశ్‌నాయక్, బస్వరాజ్ పాల్గొన్నారు.