ఎల్బీనగర్ జోన్‌బృందం, నవంబర్ 8: ఎల్బీనగర్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై 420 కేసులు నమోదయ్యాయని, వారికి ఓటేస్తే ఆగమవుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆటోనగర్ డంపింగ్ యార్డు పరిసర కాలనీల ఆత్మీయ సమ్మేళనం, బీఎన్‌రెడ్డినగర్‌లో యువత, ప్లంబర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంతో పాటు చంపాపేట, కొత్తపేట, వనస్థలిపురం డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీలో యువత చేరికల కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు విదేశీ వీసాల కేసులో మధుయాష్కీ, ఫోర్జరీ కేసులో సామ రంగారెడ్డిపై చీటింగ్ కేసులు ఉన్నారన్నారు. యూ ట్యూబ్‌లో వెతికితే వీరి బాగోతం బయటపడుతుందన్నారు. అలాంటి వారిని ఓడించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. అసంగటిత రంగంలో ఉండే వారికోసం లేబర్ కార్డులను తీసుకువచ్చి పలు పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. కార్మికులంతా తెల్ల రేషన్ కార్డులు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త కార్డులు వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ మ్మానిఫెస్టోలోని పథకాలను వివరించారు. ప్రజలంతా చర్చించుకుని ఏక పక్షంగా కారు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, కుంట్లూరు వెంకటేశ్‌గౌడ్, సామ బుచ్చిరెడ్డి, అనిల్ చౌదరి, గడ్డం మల్లేశ్ గౌడ్, సుమన్ గౌడ్, నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, టంగుటూ నాగరాజు, శ్రీకాంత్‌రెడ్డి, సాయిప్రభు, శ్రీనివాస్‌రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలను నిలదీయాలి
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేశాయని ఓటు వేయాలో కాలనీలకు వచ్చే నాయకులను నిలదీయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతుగా మన్సూరాబాద్ ఎంఈరెడ్డి గార్డెన్లో నిర్వహించిన సబ్బండ వర్గాల సంఘీభావ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీనవర్గాల అభ్యుతి కోసం పాటు పడిన సీఎం కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ సమాజం అంతా సీఎం కేసీఆర్ వైపు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రాష్ర్టానికి, దేశానికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను పీడించుకు తింటున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన నచ్చడంతోనే బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్, బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డికి నియోజకవర్గం హద్దులు కూడా తెలియవని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం నియోజకవర్గంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు వరద సహాయం కింద ఆర్థిక సహాయం అందించింది సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
అండగా ఉంటా.. ఆదరించండి
ప్రజలకు అండగా ఉంటామని, ఆదరించి కారు గుర్తుకు ఓటువేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకుడు మల్లెపాక యాదగిరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు కానుగంటి భిక్షపతితో పాటు శివదత్త పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మల్లెపాక యాదగిరితో పాటు బీఆర్ఎస్ నాగోలు డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు అడాల రమేశ్, జోగు రాములు, ఆడాల యాదయ్య, రాజేందర్, బీఆర్ఎస్లో చేరిన కానుగంటి భిక్షపతి, శివదత్త పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గుండ్లపల్లి రవీందర్, కోళ్ల మహేందర్, కోమ్ము సోమన్న, పల్లెర్ల సంజీవ, మేడి రాజు, చిలుకూరి రమేశ్, జీవీ శ్రీను, బండి నరేశ్, రింగు సురేశ్, కొమ్ము మధు, లింగాల మల్లేశ్, నర్సింహ గౌడ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కే మద్దతు.. బీసీ సంఘాల జేఏసీ
ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, తెలంగాణ కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయీ, వంశరాజ్ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శ్యామల యాదగిరి వంశరాజ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పాటు పడుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రజల రిజిస్ట్రేషన్ సమస్యలను జీవో 118తో పరిష్కారం చేయడంతో పాటు పండ్ల మార్కెట్‌ను తరలించి టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేయిస్తున్నారన్నారు. ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్న సుధీర్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ర్టాంలో మూడోసారి తెలంగాణ ప్రభుత్వం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొనమోల్ల అశోక్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురికాలనీలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పోచబోయిన జగదీశ్‌యాదవ్, పురుషోత్తంరెడ్డి, రుద్ర యాదగిరి, చెంగల్ చంద్రమోహన్, సిద్దగోని జగదీశ్‌గౌడ్, విజయభాస్కర్‌రెడ్డి, సిద్దగోని నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నువ్వులబండలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మురళిగౌడ్, పాండుగౌడ్, సంగీత తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పూర్తి సహకారంతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి అభ్యర్థించారు. బుధవారం
హయత్‌నగర్ డివిజన్లోని సుభద్ర కాలనీ, బంజారాకాలనీ, అంబేద్కర్‌నగర్, శుభోదయనగర్ కాలనీల్లో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని అతిభారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గుజ్జ జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరిరెడ్డి, భాస్కర్ సాగర్, దీపావళి శ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు అంజలిగౌడ్, యాదమ్మ చారి తదితరులు పాల్గొన్నారు.