Sudheer Reddy | బీజేపీ నేతల బస్తీ నిద్రపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మూసీపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అన్నారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్పై ప్రకటన ఏదని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు.
మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని తెలిపారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. 25వేల కోట్లతో చేసే ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు ఎలా పెరిగిందని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా పేదల ఇళ్లను కూల్చుతుందని అన్నారు.