మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మల్లారెడ్డి వర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభం
మేడ్చల్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): వ్యవసాయ విభాగంలో బీఎస్సీ చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మట్లాడుతూ మన దేశంతో పాటు విదేశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ విద్యకు డిమాండ్ ఉందన్నారు. అగ్రికల్చర్ విద్యను అభ్యసించిన వారికి అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ఆహార ఉత్పత్తులు తప్పని సరైన దృష్ట్యా నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగుకు అగ్రికల్చ ర్ చేసిన విద్యార్థుల అవసరం ఉందన్నారు. కొత్త వం గండాలను సృష్టించడంలో అగ్రికల్చర్ విద్యార్థులు పరిశోధనలు చేయాలని సూచించారు. వ్యవసాయ సాగు లో పండించే వివిధ రకాల పంటలలో ప్రొటీన్లు, న్యూ ట్రిషన్లు ఉండేలా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో వ్యవసాయం ఊపందుకుందన్నారు.
రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థుల అవసరం ఎంతైనా ఉందన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యను ప్రవేశపెట్టిన మల్లారెడ్డి విద్యా సంస్థలను మంత్రి అభినందించారు. అగ్రికల్చర్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రంలోని విద్యార్థులకే కాకుండా ఇతర రాష్ర్టాల విద్యార్థులకు సౌకర్యం కల్పించిన మల్లారెడ్డి వర్సిటీ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయంలో విద్యను నేర్పిన ఘనత మన భారతదేశానికే దక్కుతుందన్నారు. చైనా దేశాన్ని మించి మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ సాగులో నూతన విధానాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను మం త్రులు నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డిలు తిలకించారు. ఎగ్జిబిషన్ వివరాలను విద్యార్థులు మంత్రులకు వివరించా రు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూన్సివర్సిటీ డైరెక్టర్ మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్ రాజారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, యూనివర్సిటి వీసీ వీఎస్కే. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.