ముషీరాబాద్, సెప్టెంబర్ 8: వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం పెద్ద ఎత్తున గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు జరుగనున్న నేపథ్యంలో వివిధ విభాగాల అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, విద్యుత్, జలమండలి అధికారులు నిమజ్జనం ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్, పారిశుధ్యం విభాగాలకు చెందిన మొత్తం 70 మంది అధికారులు, సిబ్బంది నిమజ్జన వేడుకల్లో విధులు నిర్వహించనున్నారు.
ట్యాంక్‌బండ్‌పై 21 క్రే న్లను ఏర్పాటు చేయడంతోపాటు బారికేడ్లు, లైటింట్ సిస్టం ఏర్పాటు చేశారు. మరోవైపు సర్కిల్-15 అధికారులు నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం 5 తాత్కాలిక మూత్ర శాలలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం షిప్టుల వారీగా సిబ్బందిని నియమించారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై భక్తుల పడవేసే చెత్తా చెదారాన్ని తొలగించడానికి పారిశుధ్య విభాగాల అధికారులు ఏర్పా ట్లు చేశారు. అవసరమైన మేర సిబ్బందిని అందుబాటులో ఉంచా రు. నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అధికారులు కంట్రోల్ రూంను ఏ ర్పాటు చేశారు. డీఎం సీ, ఈఈ, ఎఎంహెచ్ఓ వంటి ఉన్నతాధికారులు కంట్రోల్ రూం నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
గణేశ్ నిమజ్జనాలు సాఫీగా సాగడానికి చిక్కడపల్లి సబ్ డివిజన్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిమజ్జన ఘట్టంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జన ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వన్‌వేలను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్‌ను మళ్లించడానికి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు అదనపు బలగాలు మొత్తం 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. నిమజ్జనంలో ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిక్కడపల్లి : పోలీ స్ సబ్ డివిజన్ పరిధిలో శుక్రవారం జరగనున్న వినాయక నిమజ్జనాలకు భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశాం వినాయక నిజ్జ నాలను ప్రజలు ప్రశాం తంగా జరుపుకోవాలి. మండపాల ని ర్వాహకులు, ప్రతి ఒక్కరూ పోలీస్ నిబంధనలను పాటిచాలి. డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిమజ్జనాల దగ్గర గట్టి పోలీస్ నిఘా ఉంటుంది. – ఏసీపీ ఎ.యాదగిరి, చిక్కడపల్లి