Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది. మంచిరేవుల ప్రాంతంలోని నార్సింగ్ -అప్పా(పోలీస్ అకాడమీ)రోడ్డులో దారికి అడ్డంగా బండరాళ్లు (Landslides) విరిగిపడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
పెద్ద పెద్ద బండరాళ్లు మార్గానికి అడ్డుగా ఉండడంతో తమతమ గమ్యానికి వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. బండరాళ్లను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అసలే ట్రాఫిక్‌లో నరకం అనుభవిస్తున్న వాహనదారులకు మరో మూడు రోజులు వాన కష్టాలు తప్పేలా లేవు. ఆగస్టు 15 శుక్రవారం, ఆగస్టు 18 శనివారం, ఆగస్టు 17 ఆదివారం అతి భారీ వర్షాల పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.