Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మల్కాజ్గిరి గౌతమ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో జీహెచ్ఎంసీ చెత్త సేకరణ వాహనం నుజ్జు నుజ్జు అయింది. వాహనంలో కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై తమ నివాసాల నుంచి బయటకు పరుగెత్తారు. బండరాయి కింద తుక్కుగా నలిగిపోయిన జీహెచ్ఎంసీ వాహనాన్ని చూసి స్థానికులు షాకయ్యారు.
తాము వాహనం పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లినందున, పెద్ద ప్రమాదం తప్పిందని జీహెచ్ఎంసీ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. అక్కడే ఉన్న మరో బండరాయి కూడా కింద పడుతుందేమో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
మల్కాజ్గిరిలో విరిగిపడ్డ కొండచరియలు
నుజ్జు నుజ్జయిన జీహెచ్ఎంసీ చెత్త సేకరణ వాహనం..వాహనంలో కార్మికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
మల్కాజ్గిరి గౌతమ్ నగర్ కాలనీలో ఒక్కసారిగా విరిగి, ఆగి ఉన్న జీహెచ్ఎంసీ వాహనంపై పడిన కొండచరియలు
భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా, బండరాయి కింద… pic.twitter.com/iI6UmfOFTH
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2025