దుండిగల్, ఫిబ్రవరి 11: వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఐదవ అంతస్తు పైనుంచి కిందపడి కూలీ మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం, ఉత్తర కంచి గ్రామానికి చెందిన ఉంగరాల సూరిబాబు(65), లచ్చమ్మ దంపతులు తమ కొడుకు, కూతురుతో కలిసి గత కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి నగర శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ పరిధిలో పలు అపార్ట్ మెంట్ వద్ద వాచ్మన్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. కొడుకు, కూతురు పెండ్లీలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.
రెండు మూడు నెలలుగా ఖాళీగా ఉన్న సూరిబాబు మూడు రోజుల నుంచి ప్రగతినగర్ నుంచి నిజాంపేట రాజీవ్ కల్పకు వెళ్లే దారిలో ఉన్న సాయిలక్ష్మి అపార్ట్మెంట్ కు చెందిన వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నాడు. మంగళవారం సైతం ఐదవ అంతస్తు పైన క్లీనింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సూరిబాబు కాలుజారి కింద పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. దుండిగల్, ఫిబ్రవరి 11: వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి కిందపడి కూలి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం, ఉత్తర కంచి గ్రామానికి చెందిన ఉంగరాల సూరిబాబు, లచ్చమ్మ దంపతులు తమ కొడుకు కూతురుతో కలిసి గత కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి నగర శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతి నగర్ పరిధిలో పలు అపార్ట్మెంట్ల వద్ద వాచ్మెన్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.
సూరిబాబు మూడు రోజుల నుంచి ప్రగతి నగర్ నుంచి నిజాంపేట రాజీవ్ కల్పకు వెళ్లే దారిలో ఉన్న సాయి లక్ష్మీ అపార్ట్మెంట్ కు చెందిన వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సైతం ఐదవఅంతస్తు పైన క్లీనింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సూరిబాబు కాలుజారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే స్థానికులు, పోలీసులు పేర్కొంటున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు.