కీసర, మే 3: ప్రభుత్వాలు చేపడుతున్న పలు ప్రతిష్టాత్మక పథకాల అమలుతోపాటు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతలో కూడా పారిశుధ్య కార్మికులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగ తి’ అమలుతో పాటు పారిశుధ్య నిర్వహణలో మేడ్చల్ జిల్లాలో కీసర మండలం ప్రత్యేక గుర్తింపును పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయడంతోపాటు మెరుగైన ఫలితాలు రావడంలో కార్మికల పాత్ర గుర్తించిన సీఎం కేసీఆర్ వారి సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి పాలనలో ఏండ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేసిన పంచాయతీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి రూ. 3500 వేతనం పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.8500 జీతం అందుకుంటున్న పంచాయతీ కార్మికులకు తాజాగా కార్మిక దినోత్సవంలో సీఎం మరో రూ. 1000 లు పెంచడంతో రూ.9500 అయింది. ప్రతి కార్మికుడికి పెంచిన వేతనాన్ని వెంటనే అమలు అయ్యే విధం గా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారుల ఉత్తర్వులతో గ్రామాల్లో ఆదేశాలు అమలు కానున్నాయి. దీంతో కీసర మండలంలోని 10 పంచాయతీల్లో మొత్తం 175 మంది పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు లబ్ధి చేకురుతుంది. కరోనా వంటి విపత్కార పరిస్థితిల్లో వెలకట్టలేని సేవలందించిన కార్మికుల సేవలకు గుర్తించి సీఎం కేసీఆర్ రూ.1000లు పెంచి కార్మికుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారని, సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని, ముఖ్యమంత్రికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని పలు కార్మిక సంఘాలు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మా జీవితాలను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు
మేము చేస్తున్న పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ వచ్చిన తరువాతనే రెండుసార్లు సీఎం కేసీఆర్ సార్.. మంచి మనసుతో జీతాలు పెంచి మా జీవితాల్లో వెలుగు రేఖలు నింపాడు. మేము అండగముందే.. మా జీవితాలను సార్ అర్థం చేసుకుని రూ.1000 పెంచడం శానా ఆనందంగా ఉంది. ఇది శ్రమను గుర్తించి, మా బతుకుల్లో వెలుగులు నింపడానికి సీఎం సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
– ఎరుకలి రవికుమార్, పంచాయతీ సిబ్బంది, కీసర
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు పంచాయతీ కార్మికులందరం రుణపడి ఉంటాం. మా కష్టజీవులు బతుకులను అర్థం చేసుకుని పంచాయ తీ కార్మికులకు మరో వెయ్యి రూపాయల జీతం పెంచడం సంతోషంగా ఉంది. సీఎం సార్ కార్మికుల కష్టాలను తొందరగా అర్థం చేసుకుంటారని మరో సారి రుజువు చేసుకున్నారు.
– కర్రె రేణుక, కీసర, పంచాయతీ సిబ్బంది