బంజారాహిల్స్,డిసెంబర్ 2 : ఎయిర్టెల్ మొబైల్ నెంబర్కు సంబంధించిన కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగిని బురిడీ కొట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 3లో నివాసం ఉంటున్న అనూప్ రాజ్ సక్సేనా అనే విశ్రాంత ఉద్యోగికి ఈనెల 11న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
ఎయిర్టెల్ ఫోన్ నెంబర్కు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, లేకుంటే ఫోన్ నెంబర్ బ్లాక్ అవుతుందని చెప్పారు. రూ.10 చెల్లిస్తే కేవైసీ అప్డేట్ చేయడంతో పాటు రీచార్జి చేస్తామని చెప్పారు.
దీంతో బ్యాంక్ డెబిట్ కార్డు వివరాలను, ఫోన్ నెంబర్ను చెప్పాడు. నిమిషాల వ్యవధిలోనే అతడి అకౌంట్నుంచి రూ.69వేలు మాయమయ్యాయి.
ఈ మేరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు అనూప్ రాజ్ సక్సేనా బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.