Talasani | బేగంపేట: భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో శనివారం కోటి కుంకుమార్చన పూజలు ప్రారంభం అయ్యాయి. శనివారం నుంచి ఐదు రోజుల పాటు కోటి కుంకుమార్చన పూజలు జరుగుతాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి కోటి కుంకుమార్చన పూజలను ప్రారంభించారు.
అంతకు ముందు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ మాజీ సభ్యులు కిషోర్ కుమార్, రాంమోహన్ యాదవ్, మహేందర్, అరుణ్ భట్, ఆనంద్ పాటిల్, నాగులు తదితరులు పాల్గొన్నారు.