MLA Madhavaram | మూసాపేట, ఫిబ్రవరి8: దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్లోని అవంతినగర్ తోట కాలనీ శ్రీ అంజనేయ స్వామి ధ్వజస్తంభం పున:ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతోపాటు డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అంజన్న ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారావు, శ్రావణ్లను ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సీహెచ్ సత్యనారయణ, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.