శామీర్‌పేట, జూలై 16 : తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులు బాలుర పాఠశాల, కళాశాల కూకట్పల్లి ప్రిన్సిపాల్ రమణిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. గురుకుల పాఠశాలలో అపరిశుభ్రమైన పరిసరాలు, నాణ్యతలోపమైన మెనూ అంటూ విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుంచి నిరసన ర్యాలీ నిర్వహిస్తూ.. తుర్కపల్లి బస్టాప్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన విషయంపై దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు ఉన్నతాధికారులు పాఠశాల ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల పర్యటన తర్వాత ఉన్నతాధికారులు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె స్థానంలో స్థానికంగా ఉన్న నవనీతను బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.