సిటీబ్యూరో, ఏప్రిల్ 18 ( నమస్తే తెలంగాణ ) : ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో అత్యద్భుతమైన మెట్ల బావుల ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఒక ప్రాంతం యొక్క ఆత్మ.. ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి, వారసత్వంలో జీవించి ఉంటుంది.
సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విలువైన వారసత్వ కట్టడాలను సంరక్షించడానికి, పునరుద్ధ్దరించడానికి ఘణనీయమైన చర్యలు తీసుకుంది. అంతరించిపోతున్న ఐకానిక్ స్మారక చిహ్నాలకు కొత్త జీవాన్ని అందించింది. వందల ఏండ్ల నాటి వారసత్వ కట్టడాలను తెలంగాణకు గర్వకారణంగా నిలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు మన సంస్కృతి గొప్పతనాన్ని పెంచాయి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.