KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్గూడ్ నుంచి జూబ్లీహిల్స్లో తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి కార్యక్తల సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం యూసుఫ్గూడ్లో పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశం అనంతరం కారులో కాకుండా ఆటోలో బయలుదేరి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది సైతం ఆయనను ఆటోలోనే అనుకరించారు.
ఆటోలో ప్రయాణం చేసిన @KTRBRS @BRSparty జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లిన కేటీఆర్. pic.twitter.com/RwTu8nf4m5
— KMR@KTR (@kmr_ktr) January 27, 2024
అయితే, సమావేశంలో కేటీఆర్ ఆటో కార్మికుల పరిస్థితిపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోవాలాల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఆటోలో ప్రయాణించి వారికి మద్దతు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సైతం ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ఆటో కార్మికులు మంటిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన సైతం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.