హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి ప్రతి ఎన్నికలోనూ ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటూ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తున్నామని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరామ్ ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని శాలువాతో సత్కరించారు.
ఈ ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని, కాంగ్రెస్ అవినీతి పాలనకు చెంపపెట్టు కొట్టే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఘనవిజయం సాధించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు సాయిరామ్ ఉప్పు. పార్టీ అభ్యర్థి విజయంతో తెలంగాణ ప్రజల గౌరవం మరింతగా పెరుగుతుందని వినయ్ సన్నీ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ పాల్గొన్నారు. మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.