సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు క్యాంపెయిన్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. రోడ్ షోలతో నియోజకవర్గాన్ని చుట్టేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్, పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
షేక్‌పేట నుంచి యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, బోరబండ వరకు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 1న షేక్‌పేట డివిజన్లో కేటీఆర్ రోడ్ షోలతో ప్రచారాన్ని ఉదృతం చేయగా, దా దాపు వారం రోజుల పాటు తన రోడ్ షోలతో శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు.