పాఠశాలల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి : ఎమ్మెల్యే వెంకటేశ్
ఎమ్మెల్యే వెంకటేశ్ | పాఠశాలల్లో ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.

గోల్నాక, ఆగస్టు 31 : పాఠశాలల్లో ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఈ నెల మొదటి వారం నుంచి అన్ని పాఠశాలలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉండటం నేపథ్యంలో మంగళవారం గోల్నాక తులసీనగర్ భారతి విద్యాభవాని పాఠశాలలో డీఈవో శ్రీధర్, డిప్యూటీఈవో నిజాంఉద్దీన్తో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని దీంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి తరగతి గదితో పాటు పాఠశాల ఆవరణల్లో శానిటైజేషన్ పనులు చేయించాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించేలా తరచూ చేతులను శానిటైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ నిబంధనలపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, కన్నె ఉమ, బి.పద్మ, అమృత, పలు ప్రైవేటు పాఠశాలలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

