వెంగళరావునగర్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ దవాఖానాలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి బుధవారం కొవిడ్ నిర్థారణ అయ్యింది. 12 మంది వైద్యులతో పాటు మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడినట్లు దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తెలిపారు.
కరోనా సోకిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా కొవిడ్ నిర్ధారణతో ఇప్పటి వరకు ఛాతీ దవాఖానాలో బయట నుంచి కేవలం 10 మంది రోగులు మాత్రమే చేరినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో కొవిడ్ బారిన పడుతున్నప్పటికీ ఎవరికీ లక్షణాలు లేకపోవడంతో దవాఖానాకు ఎవరూ రావడం లేదని సూపరింటెండెంట్ తెలిపారు.
అయితే ముందస్తు చర్యగా దవాఖానాలో ప్రస్తుతం 60 పడకలతో పాటు సరిపడినంత ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. అవసరం మేరకు మరిన్ని పడకలు కూడా అందుబాటులోకి తీసురానున్నట్లు తెలిపారు.