హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరవపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వాన పడుతున్నది. దీంతో కోఠి ఈఎన్టీ దవాఖాన (Koti ENT Hospital) నీట మునిగింది. హాస్పిటల్లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచింది. వరద నీటికి తోడు డ్రైనేజీల్లో నుంచి సిల్ట్ రావడంతో ఇసుక మేట వేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, ఉప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఓయూ, నల్లకుంట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై పెద్దఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.