Kota Neelima | కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీలు, రికమండేషన్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైరవీలు చేయించుకోవాలన్నా.. చేయాలన్నా కాంగ్రెస్ నేతుల ముందు వరుసలో ఉంటారని తాజాగా బయటకు వచ్చిన వీడియో ఒకటి చెప్పకనే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీలో జీ హుజూర్ అంటే చాలు కావాల్సిన తమకు కావాల్సిన పదవులు, హోదాలు అవే వచ్చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ.
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీతో కాళ్లు మొక్కించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకారం చేయగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో కోట నీలిమ ఉత్సవ కమిటీ సభ్యులతో పాదాభివందనం చేయించుకుంటున్న దృశ్యాలు కాంగ్రెస్ పార్టీలో పైరవీలు ఎలా ఉన్నాయో హింట్ ఇచ్చేస్తున్నాయంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీతో కాళ్లు మొక్కించుకున్న కోట నీలిమ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకారం చేయగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ సభ్యులతో పాదాభివందనం చేయించుకుంది. pic.twitter.com/3W1MC86woh
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026