మణికొండ, నవంబర్ 2 : దేశ చరిత్రలోనే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానంలో క్రాంతిగా వెలుగుతున్న కేఎల్ యూనివర్సిటీ నేటి ఏఐ యుగానికి అద్భుతమైన వేదికగా మారుతుందని కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే-కేఎల్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ‘లక్ష్యం-2026’ ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపై ఆదివారం నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో అవగాహన సదస్సును స్థానిక కేవీఎంఆర్ ప్రైడ్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా, నమస్తే తెలంగాణ అడ్వటైజ్మెంట్ విభాగం ఏజీఎం రాజిరెడ్డి, శ్రీ చైతన్య కళాశాల డీన్ డా.గోవింద్‌రాజులు, కేఎల్ రీజినల్ మేనేజర్ కె.రాజేశ్, అడ్మిషన్స్ మేనేజర్ గౌతమ్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులనుద్దేశించి కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ పబ్లిసిటీ కోసమో.. మరోదాని కోసమో అవగాహన సదస్సులను నిర్వహించడం లేదని తెలిపారు. విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న పోటీ తత్వానికి తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ లాంటి దిగ్గజ యూనివర్సిటీలతో సరిసమానంగా విద్యను అందించమే కేఎల్ యూనివర్సిటీ లక్ష్యం అన్నారు. ఉన్నత యూనివర్సిటీల్లో అందించే స్థాయిలో విద్యను అందించడం, ప్రతిభను బట్టి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను అనేక మందికి అందించామన్నారు. ఈ ఏడాది 8 వేల మందికి ప్లేస్మెంట్లు అందించినట్లు తెలిపారు. శాటిలైట్ ప్రయోగాలతో జాతీయస్థాయిలో గుర్తింపు సాధించామన్నారు.

విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో జాతీయస్థాయిలో 26వ స్థానంలో కేఎల్‌యూ ఉందన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా వందకోట్ల విలువైన స్కాలర్షిప్ ద్వారా ఫీజులల్లో రాయితీలు కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు ఇక్కడ డ్యుయల్ డిగ్రీలు చేసుకునే అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మల్టీ డిసిప్లినరీ డిగ్రీలతో అద్భుతమైన విజయాలను సాధించే అవకాశాలున్నాయని వివరించారు. ప్రతి విద్యార్థీ ఐఐటీలో ర్యాంకు సాధించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతారని, అయితే కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో ర్యాంకులను అందిపుచ్చుకోకపోతే అదేస్థాయిలో కేఎల్ యూనివర్సిటీ అవకాశాలను కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సరైన వేదిక అన్నారు.
కేఎల్ యూనివర్సిటీలో డ్యుయల్ డిగ్రీ పథకంలో విద్యనభ్యసించే విద్యార్థులకు పరిశ్రమపరమైన ప్రాజెక్టులు, లైవ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఉద్యోగ, పరిశోధన అవకాశాలు అనేకం ఉన్నాయన్నారు.
2025లో నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ప్రకారం కేఎల్ యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా 26వ ర్యాంక్ దక్కించుకుందని శ్రీనివాసరావు తెలిపారు. విద్య, పరిశోధన, విద్యార్థి స్థాయిలోని సాంకేతిక విజ్ఞానంతో పాటు ప్రతిభ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చామన్నారు. దేశ వ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన యూనివర్సిటీల్లో సెంట్రల్ యూనివర్సిటీ ముందు వరుసగా 26వ స్థానంలో కేఎల్ యూనివర్సిటీ ఉందని గుర్తుచేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల్లో కేఎల్ యూనివర్సిటీల్లో తమ విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. గతేడాది తమ యూనివర్సిటీలో వందశాతం ఉద్యోగ అవకాశాలు వచ్చిన వారిలో అత్యధికంగా ఏడాది రూ.75 లక్షల ప్యాకేజీగా, యావరేజీగా 8.1లక్షల వరకు విద్యార్థులు ఉద్యోగాలు పొందారని అన్నారు.
కేఎల్ యూనివర్సిటీ ఓ యూనివర్సిటీయే కాకుండా ఈ క్యాంపస్‌లో ఓ ఇండస్ట్రీనే స్థాపించామని డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఐఐటీ, త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలకు దీటుగా అంతే స్థాయిలో విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. తమ యూనివర్సిటీలో 34 మంది విద్యార్థులు మూడు శాటిలైట్లను ఆవిష్కరించి దేశ చరిత్రలో నిలిచారని గుర్తుచేశారు. నిత్యం ప్రజలకు అవసరమయ్యే విధంగా జీపీఎస్ శాటిలైట్, వాతావరణంలో ఏర్పడే మార్పులను ముందే పసిగట్టి తెలుపడం, గ్రీన్‌స్పేస్ టెక్నాలజీలను తమ విద్యార్థులు తయారుచేశారని గుర్తుచేశారు. విద్యార్థుల శాటిలైట్లు కేఎల్ సాట్-2(2యు క్యూబ్‌సాట్), కేఎల్ జేఏసీ(పీకో బెలూన్ శాటిలైట్), క్యాన్సాట్(ప్లెక్సిబుల్ మాడ్యూల్)ను దేశమంతట పరిశోధనా వేదికగా ఆవిష్కరించారని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుకు అప్కాస్ట్, రెడ్వింగ్, ఇస్రో డైరెక్టర్ల పర్యవేక్షణతో ఇండస్ట్రీ, అకడమిక్, ప్రభుత్వం సంయుక్తంగా సహకరించాయని తెలిపారు. శాటిలైట్ల డిజైన్, నిర్మాణ, ప్రయోగం ఇవి మొత్తం విద్యార్థుల చేతుల్లోనే జరిగిన ప్రాక్టికల్ ట్రైనింగ్‌గా ఉదహరించారు. కేఎల్‌యూలో ఆర్ అండ్ డీ పరిశోధనలు ఆయా కాలానుగుణంగా ప్రత్యేకతను చాటుకునేలా పాఠ్యాంశాలను రూపొందించి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత సరైన ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ లాంటి యూనివర్సిటీల్లో ర్యాంకు సాధించలేకపోతే ప్రత్యామ్నాయంగా కేఎల్‌యూనివర్సిటీలో 90శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత ప్రవేశాలను అందిస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కల్గిన విద్యార్థులను తమ యూనివర్సిటీ రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేస్తామని ఆయన అన్నారు.
పోటీ ప్రపంచ యుగంలో ప్రతిభావంతులకు అద్భుతమైన వేదికగా కేఎల్ యూనివర్సిటీని ఎంచుకోవచ్చున్నారు. ఎంతో కష్టపడి చదివిన తర్వాత చిన్న చిన్న పాయింట్ల రూపంలో ఐఐటీ, త్రిబుల్ ఐటీలల్లో ప్రవేశాలను కోల్పోయే విద్యార్థులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు ఎలాంటి చింత లేకుండా కేఎల్‌యూలో చేరితే అంతే స్థాయిలో తీర్చిదిద్ది విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకు వేదికగా నిలుస్తారని డీన్ గోవిందరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకునేందుకు ఇదో మంచి అవగాహన సదస్సుగా ఆయన అభివర్ణించారు.
– గోవిందరాజులు శ్రీ చైతన్య కళాశాల డీన్(నార్సింగి)
ఎంతగానో శ్రమించి ర్యాంకుల కోసం పాటి పడినా ఒక్కోసారి అనుకున్నది సాధించలేకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న అద్భుత అవకాశాలను విద్యార్థులు కృంగిపోకుండా తమ లక్ష్యాలను సాధించేందుకు మంచి వేదికగా ఉంది. ఈ సదస్సు ద్వారా చాలా విషయాలను తెలుసుకున్నాం.
– క్రాంతి చరణ్, విద్యార్థి