సుల్తాన్‌బజార్,ఆగస్టు 6 : వివాహం చేసుకునేందుకు నగరానికి వచ్చిన ఓ ప్రేమ జంట కిడ్నాప్‌కు గురైన కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ భిక్షపతి,ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పేట్ మద్దూర్ మండలం, బండగొండకు చెందిన శివశంకర్, నిదిజింతకు చెందిన హర్షితరెడ్డి ప్రేమికులు. గురువారం వివాహం చేసుకునేందుకు బీహెచ్ఈఎల్కు చెందిన స్నేహితుల సహకారంతో బడీచౌడీ ఆర్యసమాజ్ కు చేరుకున్నారు. కాగా.. ప్రేమ జంటను ఎర్టీగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసిన విషయం విదితమే. అమ్మాయి స్నేహితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వాహనం గుర్తించారు. వాహనం మద్దూర్ మండలం మీదుగా వెళ్తున్నట్లు గ్రహించి మద్దూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. శ్రీకాంత్‌రెడ్డి బృందంతో కలిసి మద్దూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్‌నకు పాల్పడిన కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్యామల్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.